Agra Bikers Viral video: నెట్టింట కొన్ని వీడియోలు వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ట్రక్కు డ్రైవరు బైకర్లను ఢీకొట్టి మరీ కిలోమీటర్ మేరా లాక్కెల్లాడు. వాళ్లు లారీ కింద చిక్కుకుని ఆపాలని ఎంత ఆర్త నాదాలు పెట్టినా, అరిచినా డ్రైవర్ మాత్రం పారిపోయేందుకు అలాగే లాక్కెళ్ళాడు. లారీ ముందు భాగంలో గట్టిగా పట్టుకోవటంతో చక్రాల కింద పడకుండా వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాత్రి 11:30 గంటల సమయంలో బైకర్లు హైవేపై వెళ్తున్నారు. రాంబాగ్‌ కూడలికి వచ్చిన తర్వాత వాళ్లు ట్రక్ ను ఓవర్ స్పీడ్ చేసి ముందుకు వెళ్లారు. దీంతో ఆ ట్రక్ డ్రైవరు ఒక్కసారిగా బైక్ ను బలంగా వెనుక నుంచి ఢీకొట్టడంతో దాని కింద బైక్ తో పాటు ఇద్దరు వ్యక్తులు పడి ఇరుక్కుపోయారు. అలాగే చిక్కుకుపోయి సుమారు కిలోమీటర్ మేర ట్రక్ డ్రైవర్ లాక్కెళ్తునే ఉన్నాడు. సదరు బైక్‌ డ్రైవర్లు ఆపమంటూ గగ్గోలు పెట్టినా వినకుండా పారిపోయేందుకు డ్రైవర్ అలాగే పట్టించుకోకుండా మరింత స్పీడు పెంచుతూ దూసుకెళ్లాడు.


పక్కనే రోడ్డుపై వెళ్తున్న ఆటో డ్రైవర్లు, పాదచారులు, బైకర్లు కూడా పక్క నుంచి లారీ డ్రైవర్ ని ఆపే ప్రయత్నం చేశారు. హారన్లు కొడుతూ లారీని ఫాలో చేశారు. అయినా డ్రైవర్‌ ఏమాత్రం వినకుండా అలాగే 36 సెకండ్ల వీడియోలో ముందుకు వెళుతూ ఉన్నాడు. డ్రైవర్ ఆపకపోవడంతో వాహనాలతో అడ్డగించి లారీని ఆపేశారు తోటి ప్రయాణీకులు. దీంతో ఆ లారీ డ్రైవర్ అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు.


 




 


తీవ్ర గాయాలపై పాలైన బైక్‌ రైడర్లను ఆస్పత్రిలో చేర్పించారు స్థానికులు. వారి చర్మం పూర్తిగా దెబ్బతిన్నది. చర్మం ఒలుచుకుపోయింది. ఒకవేళ పరిస్థితి చేయి దాటి ఉంటే వాళ్ళు చనిపోయేవారు కూడా. అయితే, ఈ వీడియోపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. 


ఇదీ చదవండి:  పీవీ సింధు రిసెప్షన్‌ ఫొటోలు.. హైదరాబాద్‌కు అతిరథ మహారథులు..  


ఈ డేంజరస్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే ఈ వీడియోలో పక్క నుంచి మరో బైక్ డ్రైవర్‌ లారీని ఫాలో అయ్యాడు .మరొకరు చెప్పులు కూడా విసిరారు ఆపాలని వెంబడించిన డ్రైవర్ వినకుండా మరింత స్పీడ్ చేసి వెళ్తున్న వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో సదరు డ్రైవర్ పై నిప్పులు చెరుగుతున్నారు. తోటి బైక్‌ రైడర్లు ఆపకపోతే అలాగే ప్రాణాలు తీసేవాడా? ప్రాణాలు పోయి ఉంటే ఏం జరిగేది పట్టించుకోకుండా దూసుకెళ్లాడంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. డ్రైవర్‌ను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్‌ చేసి తగిన శిక్ష వేయాలి. ఇంకోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అడ్డుకోవాలని నెటిజెనలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇదీ చదవండి: నాగ చైతన్య - శోభిత సహా ఈ ఇయర్  మ్యారేజ్ చేసుకున్న సినీ సెలబ్రిటీలు వీళ్లే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.